calender_icon.png 21 February, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా తీర్పు గౌరవించకుంటే భవిష్యత్తు ఉండదు

21-02-2026 02:26:03 AM

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 20: ప్రజలకు ఎవరిని ఓడించాలి, ఎవరికి పట్టం కట్టాలనీ తెలుసునని, వారి తీర్పును గౌరవించకుంటే భవిష్యత్తు ఉండదనీ సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర వారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసి 14 మందిని క్యాతనపల్లి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారనీ, ఇది ప్రజల తీర్పు అని దీనిని కాదని కాంగ్రెస్ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రెండుసార్లు కావాలనే వాయిదా వేశారని, డీసిసి అధ్యక్షుడు మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చుని అధికారులను బెదిరించడం సిగ్గు మాలిన చర్య అని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించి చైర్మన్ పీఠాన్ని కూటమికి వదిలిపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.