6న కేర్ హాస్పిటల్స్‌లో వాస్క్యులర్ హెల్త్ చెక్‌అప్
- జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
- నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, మానని పాద గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు
- ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పీసీ గుప్తా
హైదరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి): జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా ప్రజ ల్లో రక్తనాళాల వ్యాధులపై అవగాహన పెం చడం, ప్రారంభ దశలోనే వాటిని గుర్తించే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో గురువారం ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెక్‌అప్ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉచిత డాప్లర్ పరీక్షతో పాటు ప్రముఖ వాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్‌వోడీ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ, వాస్క్యులర్ ఐఆర్ అండ్ పోడి యాట్రిక్ సర్జరీ డాక్టర్ పీసీ గుప్తా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు.
కాగా జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా డాక్టర్ పీసీ గుప్తా మాట్లాడుతూ, ‘నడిచేటప్పుడు వచ్చే కాళ్ల నొప్పిని చాలా మంది వయస్సు పెరిగిన కారణంగా భావిస్తారు. కానీ అది కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోతున్న తొలి హెచ్చరిక కావచ్చు. అలాగే కాళ్ల వాపు, పాదాలు చల్లబడటం లేదా మా నని గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించు కుంటే సరైన చికిత్స అందించి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు’అన్నారు. ‘మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలె స్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసే వారు, 50 ఏళ్లు పైబడినవారు వాస్క్యులర్ వ్యాధులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ ఉచిత ఆరోగ్య పరీక్షల ద్వారా ప్రజలు వ్యాధి ముదరకముందే రక్తప్రసరణను పరీక్షించించుకోవాలని మేము కోరుతున్నాం’ అని ఆయన తెలిపారు. కేర్ హాస్పిటల్స్, బం జారాహిల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని ముందుగానే గుర్తించి నివారించడం కూడా అంతే ముఖ్యం. జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా నిర్వహిస్తున్న.
ఈ కార్యక్ర మం ద్వారా ప్రత్యేక వాస్క్యులర్ స్క్రీనింగ్‌ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, రక్తనాళాల వ్యాధుల ప్రారంభ హెచ్చరిక సంకేతాలపై అవగాహన పెంచడం మా లక్ష్యం’ అన్నారు. కాగా ఈ ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెక్‌అప్ ఆగస్టు 6, గురువారం మాత్రమే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని కేర్ హాస్పిటల్స్ ఔట్‌పేషెంట్ సెంటర్‌లో అందుబాటులో ఉంటుంది. ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరి. పరిమిత సంఖ్యలో మాత్రమే నమోదు చేసుకుంటారు. అపాయింట్‌మెం ట్ కోసం 040-61 565656 నంబర్‌ను సంప్రదించవచ్చు.






