2 June, 2026 | 3:25 PM

శివాజీ చరిత్ర పుస్తకాన్ని సీఎంకు అందజేసిన వాంకిడి ఉప సర్పంచ్

02-06-2026 02:25 PM

వాంకిడి,(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దీపక్ ముండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన బహిరంగ సభ కార్యక్రమంలో సీఎంను కలిసి దీపక్ ముండే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత విశేషాలు, పరిపాలనా దక్షతను తెలియజేసే 'SHIVAJI THE GREAT' పుస్తకాన్ని బహుకరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వాంకిడి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. పుస్తకాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి, శివాజీ పాలన నేటి పాల కులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్లు దీపక్ ముండే తెలిపారు.