2 June, 2026 | 3:00 PM

పవన్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరణ

02-06-2026 02:19 PM

హైదరాబాద్: హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ దాఖలు(Janasena Petition) చేసిన 'హౌస్ మోషన్' పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) మంగళవారం తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(Telangana State Formation Day Celebrations) సందర్భంగా నిర్వహించ తలపెట్టిన సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే, ఈ అంశం 'హౌస్ మోషన్ పిటిషన్' కింద అత్యవసర విచారణకు అర్హమైనది కాదని పేర్కొంటూ, న్యాయస్థాన రిజిస్ట్రీ ఆ పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. గతంలో, సభ నిర్వహణకు అనుమతి కోరుతూ జనసేన సైబరాబాద్ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, వివిధ కారణాలను చూపుతూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది, కానీ అక్కడ కూడా ఆ పిటిషన్ కొట్టివేయబడటంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అటు పవన్ కళ్యాణ్ ఇంట్లో సాయంత్రం 4.30 గంటలకు ప్రెస్ మీట్ అనుమతి ఇవ్వాలంటూ ఎక్స్ లో పోస్టుచేశారు.