25 February, 2026 | 10:54 PM

శైవక్షేత్రం పీఠం ఆధ్వర్యంలో వనితా శంఖారావం

25-02-2026 12:00 AM

పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, మఠాధిపతులు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): ప్రముఖ శైవక్షేత్ర పీఠం శివస్వామి ఆధ్వర్యంలో సికిందర్‌బాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో వనితా శంఖారావం ఘనంగా నిర్వహించారు. శ్రీశైవ క్షేత్ర వనితశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ అఫ్ ధర్మ రక్షతి రక్షితఃట్రస్ట్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశంలోని ప్రముఖ మఠ పీఠ ఆశ్రమాధిపతులు, వివిధ హిందూ సంఘాల అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కుల సంఘాల అధ్యక్షులు, గోశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన మాతృమూర్తులకు ధర్మ శిరోమణిని ప్రదానం చేశా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయలు పాల్గొని ఈ పురస్కారాలను అందజేశారు.

అలాగే వేలాది మంది మహిళలు శ్రీచక్ర కుం కుమార్చన పూజల్లో పాల్గొని మణిద్వీప వర్ణన, శివ సహస్రనామ పారాయణం, భగవద్గీత 40 శ్లోకాలు, హనుమాన్ చాలీసా పారాయ ణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శలు భక్తులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు హైమ, కోటేశ్వరరావు, జగిని శ్రీనివాస్, ఎల్‌వీ కుమార్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.