నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
24-06-2026 12:51 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మాణం చేసిన నేషనల్ మార్ట్ సూపర్ మార్కెట్(National Mart Supermarket) ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం ప్రారంభించారు. మార్కెట్ వద్దకు వచ్చిన మంత్రులను కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందర్ని అప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.






