SIR డ్రైవ్‌పై సమీక్ష: 10 రోజుల గడువు విధించిన సీఎం రేవంత్
హైదరాబాద్: టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు సహా పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్ఐఆర్(Special Intensive Revision) ప్రక్రియ చాలా సీరియస్ అంశమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పై అందరూ అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొందరు నాయకులు ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యంగా ఉంటున్నారు.. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు.
ఎస్ఐఆర్ అవగాహన సదస్సులపైన(SIR Awareness Seminar) జిల్లాల వారీగా తన దగ్గర రిపొర్టు ఉందని సీఎం స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పై ఇన్ ఛార్జి మంత్రులు(Telangana In-charge Ministers) మరింత బాధ్యతాయుతంగా వ్యహహరించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో సరిగా వ్యవహారించకపోతే పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుందని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని తెలిపారు. ఎస్ఐఆర్ పైన పార్టీ ఆదేశాలను పట్టించుకోని వారి స్థానంలో మరొక ఇన్ ఛార్జిని నియమిస్తాం, ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించమని తేల్చిచెప్పారు. పని చేయకుండా పార్టీకి నష్టం కల్గిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. పని చేయనివారికి 10 రోజుల సమయం ఇచ్చి చూస్తామన్న రేవంత్ రెడ్డి పార్టీ సర్పంచ్‌లతో గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని ఆదేశించారు.






