24 June, 2026 | 2:05 PM

ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి

24-06-2026 12:48 PM

రాజేంద్రనగర్: ఆస్తికోసం కన్నతండ్రిపైనే కుమారుడు దాడి చేశాడు. ఆస్తుల(Property) ముందు అనుబంధాలు నిలవడం లేదంటూ నిరూపించే అమానుష ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని ఉప్పరపల్లిలో చోటుచేసుకుంది. కుమారుడి నుంచి ప్రాణహాని ఉందంటూ తండ్రి అనంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొడుకు నుంచి రక్షించాలంటూ తండ్రి పోలీసులను ఆశ్రయించారు.

తన కొడుకు చంపేస్తానని హెచ్చరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కష్టపడి సంపాదించిన భూమిని తన ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చేసిన అనంత్ రెడ్డి, వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటుందని 300 గజాల స్థలాన్ని ఉంచుకున్నాడు. చిన్న కొడుకు ఆ స్థలాన్ని తన పేరుమీద రాసి ఇవ్వాలని గొడవకు దిగాడు. తండ్రి పై కొడుకు దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అనంతరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.