24 June, 2026 | 2:05 PM

ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం

24-06-2026 12:53 PM

మధిర,జూన్24(విజయక్రాంతి): చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో జూన్ 30 న నిర్వహించనున్న ఆశీర్వాద సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సభ ఏర్పాట్లపై మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయ్ కుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు ఇన్‌చార్జులు డివిజన్ కమిటీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులతో కలిసి మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... గ్రామాలు డివిజన్ల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే వేదికగా ఈ సభ నిలవనుందని తెలిపారు.