24 June, 2026 | 1:26 PM

బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం

24-06-2026 12:29 PM

హైదరాబాద్: టీటీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Goud comments) అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు సహా పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. రేపటి నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతూందని మహేశ్ గౌడ్(Mahesh Goud) పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తోందో మనం చూస్తున్నామని తెలిపారు. అప్రమత్తంగా లేకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్(All India Trinamool Congress) అధికారమే కోల్పోయిందని మహేశ్ గౌడ్ వివరించారు. మనకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకికవాద ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేసే ప్రమాదం ఉందని టీపీసీ చీఫ్ ఆరోపించారు. అర్హత గత ప్రతి ఓటును కాపాడాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏలు కీలకంగా పని చేయాలని నేతలను మహేశ్ గౌడ్ ఆదేశించారు.