24 June, 2026 | 2:18 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

మహిళా న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ విధుల బహిష్కరణ

25-02-2026 12:00 AM

వేములవాడ, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): వేములవాడలోని న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. బోధన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న జి. కళ్యాణిపై ఈ నెల 22న జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు. వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ప్రధాన ద్వారం ముందు నినాదాలు చేశారు.

దుండగులను కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, పిట్టల మనోహర్, పెంటరాజు, కొడిమ్యాల పురుషోత్తం, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, స్రవంతి, అపర్ణ, నాయిమా నాసారి తదితరులు పాల్గొన్నారు.