26 August, 2026 | 3:29 AM

పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

25-08-2026 10:05 PM

చిట్యాల,(విజయక్రాంతి): మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిన్నకాపర్తి గ్రామ గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ అన్నారు. మంగళవారం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటారు. సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.