26 August, 2026 | 2:31 AM

శారాజీపేటలో ఘనంగా వన మహోత్సవం

25-08-2026 10:02 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతి మధు, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, ఏపిఓ సంజన, టిఏ మానస, గ్రామ సెక్రటరీ సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు బండ శ్రీను, బోధసు నర్సింగరావు, కంతి భిక్షపతి, కంతి బాలరాజు, చిలుకు ప్రశాంత్, పెండ్యాల నాగరాజు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంతి మధు మాట్లాడుతూ పచ్చదనం పెరిగితేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శారాజీపేట గ్రామాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్కల సంరక్షణకు అందరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.