అక్కరకు రాని ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డులు
25-08-2026 10:00 PM
- టీఎన్జీవోల కేంద్ర సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి యంఎ హమీద్
ముకరంపుర,(విజయక్రాంతి): ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డులు ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేయడం లేదని టీఎన్జీవోల కేంద్ర సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి యంఎ హమీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం హాస్పిటల్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని, స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జేఏసీ పిలుపు మేరకు 27న జరిగే మహా ధర్న ద్వారా ప్రభుత్వాన్ని దిగ్భందించి డిమాండ్లు సాధించుకుంటామని తెలిపారు.






