7 June, 2026 | 1:39 AM

బుడ్డోడికి పిలుపొచ్చింది

07-06-2026 12:22 AM

టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ

15 ఏళ్లకే జాతీయ జట్టులో ప్లేస్

సచిన్ రికార్డు బ్రేక్

అగార్కర్ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీని మేం ఎంపిక చేయలేదు.. తన బ్యాటింగ్ తో ఎంపిక చేసేలా మమ్మల్ని బలవంతం చేశాడు... ఇదీ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వైభవ్ ఎంపికపై చెప్పిన మాట... ఈ ఒక్క మాట చాలు వైభవ్ సూర్యవంశీ ఏ స్థాయిలో సెలక్టర్లను ఆకట్టుకున్నాడో చెప్పేందుకు. బుడ్డోడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన సెలక్టర్లు టీమిండియాలోకి వెల్‌కమ్ చెప్పారు.

ముంబై, జూన్ 6: ఇటీవల ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వం సాలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బుమ్రా నుంచి కమిన్స్, స్టార్క్ , రబాడ, ష మీ వంటి హేమాహేమీ బౌలర్లను ఉతికారేశాడు. అసలు 140 కి.మీ వేగానికి పైగా వచ్చే బంతులను అంతే వేగంతో బౌండ రీ అవతలకు పంపించాలంటే ఆ బ్యాటర్ వయసు కనీసం పాతికేళ్లయినా ఉండాలి. కానీ 15 ఏళ్ల సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఈ బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు.

వాళ్ళ బౌలిం గ్‌ను ఎదుర్కొనే క్రమంలో కొంచెం కూడా బెదురు లేదు. ఈ విధ్వంసకర ఇ న్నింగ్స్‌లకు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయా రు. గత కొంతకాలంగా వైభవ్ ను జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ పలువురు మా జీ క్రికెటర్లు బీసీసీఐకి సూచిస్తూనే ఉన్నారు. తాజా ఐపీఎల్ ప్రదర్శనలతో సెలక్టర్లు కూడా వా రందరి అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూ ర్యవంశీ విధ్వంసం ఓ రేం జ్‌లో సాగిం ది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

16 మ్యా చ్లలో 48. 50 సగటు, ఏకంగా 237. 30 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సా ధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. మూడుసార్లు 90 పరు గులు చేశాడు. ఈ సీజన్లో అతడు ఏకంగా 72 సిక్సర్లు బాదా డు. దీంతో ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. మోస్ట్ వాల్యు బుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవా ర్డు, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్‌గానూ నిలిచాడు. ఎమర్జింగ్ ప్లే యర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కింది.

ఈ అద్భుతమైన ఫామ్ చూసి సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోకుండా ఉండలేకపో యారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పా టు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులోనూ వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అత్యం త పిన్నవయసు లో టీమిండియాకు ఎంపికైన ప్లేయర్‌గా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత్ జట్టుకు ఎంపిక అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైభవ్ 15 ఏళ్ల 71 రోజులకే జాతీ య జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఐర్లాండ్‌పై అతని అరంగేట్రం లాంఛనమే. అప్పుడు అత్యంత చిన్న వయసులో భారత్‌కు ఆడిన ప్లేయర్‌గా రికార్డులకెక్కుతాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ తరపున అ త్యంత తక్కువ వయసులో టీ20 అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా ఆప్ఘనిస్థాక్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహమాన్ రికార్డ్ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేయబోతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లోనూ బుడ్డోడి బ్యాటింగ్ విధ్వంసంతో గత రికార్డులన్నీ గల్లంతవడం ఖాయమని పలువురు అం చనా వేస్తున్నారు. వైభవ్ ప్రస్తుతం శ్రీలంకలో ట్రై సిరీస్ కోసం భారత్ ఏ జట్టు తర పున ఆడుతున్నాడు.