7 June, 2026 | 2:23 AM

‘లాలూ’కు జడ్‌ప్లస్ భద్రత తొలగింపు

07-06-2026 01:06 AM
  1. వై ప్లస్ సెక్యూరిటీ తమకు వద్దు
  2. సొంత నేతలతో కర్రలతో కాపలా!
  3. బీహార్ ప్రభుత్వంపై లాలూ కుటుంబం ఆగ్రహం

పాట్నా, జూన్ 6 (విజయక్రాంతి): ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. వైప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పించడం తో ఈ చర్యను ఆ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. కేటాయించిన భద్రత తమకొద్దం టూ తమ నివాసం నుంచి తిప్పి పంపించి వేసింది. పాట్నాలోని 10 సర్క్యూలర్ రోడ్‌లో ఉన్న లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రల చేతబూని కాపలా కాయడం శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రతిపక్ష హోదా కలిగిన తేజస్వీయాదవ్, ఎంపీ మీసా భారతికి ఉన్న భద్రతను బీహార్ ప్రభు త్వం కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఉన్న వైప్లస్ భద్రతను తొలగించి, ఓ కానిస్టేబుల్‌ను ఏర్పా టు చేసింది. ఈ పరిణామాలపై లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తేజస్వీయాదవ్, మీసా భారతి, రోహిణి ఆచార్యలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమను ఏదో చేయాలని అనుకుంటుందన్నారు.

తమ కుటుంబానికి హాని కలి గించా లనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జడ్‌ప్లస్ సెక్యూరిటీని తొలగించిందని ఆరోపించారు. బీహార్ తొలి మహిళా సీఎం అయిన తన తల్లి రబ్రీదేవిపై కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. 

ఈ పరిణామాలతో ఆర్జేడీ నాయ కులకు ఉన్న భద్రతను వెనక్కి పంపిస్తున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తియాదవ్ తెలిపారు. తమకు తాము భద్రత కల్పించుకోగలమని చెప్పారు. కాగా బీహార్ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు పాట్నాలోని 10 సర్క్యూలర్ నివాసాన్ని కేటాయించిన అనంతరం, దానిని ఖాళీచేయాలని బీహార్ ప్రభుత్వం రబ్రీదేవిని కోరింది. దీంతోనే ఈ వివాదం కావాలనే తెరపైకి తీసుకువస్తున్నారని పలువురు ఎన్డీయే నాయకులు చెబుతున్నారు.