7 June, 2026 | 2:36 AM

బొల్లా బ్రహ్మనాయుడికి రిమాండ్

07-06-2026 01:21 AM

కోర్టు ఆదేశాలతో జైలుకు..

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను శనివారం హైదరాబాద్ సీపీ ఆఫీసుకు తీసుకొచ్చి, భూ కబ్జాపై ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అలాగే వెల్ది రాధాకృష్ణ, నిమ్మల దశరథ కుటుంబంతో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీశారు. కాజేసేందుకు యత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం బొల్లా బొల్లా బ్రహ్మనాయుడును ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయన్ను జైలుకు తరలించారు.