గ్యాస్ ధర రూ.29 పెంపు
07-06-2026 01:18 AM
మూడు నెలల వ్యవధిలో రెండోసారి
గృహ వినియోగదారులపై మరోసారి భారం
న్యూఢిల్లీ, జూన్ 9: వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. సిలిండర్‌పై రూ.29 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 965 ఉండగా, 29 పెంపుతో రూ. 994కు చేరింది. ఢిల్లీలో రూ. 913 నుంచి రూ. 942కు పెరిగింది. కాగా, మూడు నెలల వ్యవధిలోనే కేంద్రం రెండు సార్లు గ్యాస్ ధర పెంచి సామాన్యుడి నెత్తిన మోయలేని భారం మోపింది.






