1 September, 2026 | 1:49 AM

బుడ్డోడి విధ్వంసం

01-09-2026 01:02 AM

పిన్న వయసులో హాఫ్ సెంచరీ 

దులీప్ ట్రోఫీలో రికార్డు

57 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన వైభవ్

బెంగళూరు, ఆగస్టు 31: భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత కొనసాగుతోంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొన్న ఐపీఎల్‌లో, తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొట్టిన వైభవ్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు.

సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 157 రోజులు) అర్ధశతకం సాధించిన ప్లే యర్‌గా లక్ష్మణ్ సింగ్ (1969లో 16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉన్న 57 ఏళ్ల నాటి రికార్డు ను బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. వన్డే తరహా బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఫియర్లెస్ బ్యా టింగ్‌తో మాజీ డా షింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించాడు. తనకే సాధ్యమైన భారీ సిక్సర్లతో బౌ లర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 81 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల తో 92 పరుగులు చేసి సెంచరీకి కేవలం 8 పరు గుల దూరంలో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు గాయం కావడంతో, కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా బాధ్యత లు చేపట్టి జట్టును నడిపించాడు.

ఈ మ్యాచ్ లో సెంచరీ చేయకపోయినా.. రెడ్ బాల్ క్రికె ట్‌లో ఆడే సత్తా తనకు ఉందని వైభవ్ సూ ర్యవంశీ చాటి చెప్పాడు. ఇదే తరహా దూకు డు కనబరిస్తే అతి త్వరలోనే వైభవ్ ఓపెనర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నా డు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ కూడా అతనికి అండగా నిలిచాడు. 70 బంతుల్లో అతను 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫల మవడంతో ఈస్ట్ జోన్ ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. సరిగ్గా సెంట్రల్ జోన్ చేసిన 266 పరుగులకు అలౌట్ అయింది.