11 July, 2026 | 2:36 AM

గోవుల్లో ముద్ద చర్మ వ్యాధి నివారణకు టీకాలే ఏకైక మార్గం

11-07-2026 01:35 AM

అసిస్టెంట్ డైరెక్టర్ డా .పి.పెంటయ్య

కోదాడ, జూలై 10: కోదాడ పట్టణం వెలిశాల బ్రహ్మయ్య వీదిలో తెల్లజాతి పశువులకు సోకే అత్యంత ప్రమాదకర అంటురోగం ముద్దచర్మ వ్యాధి నివారణకు  నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శుక్రవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ముద్ద చర్మ అంటురోగానికి కోదాడ పట్టణంలో టీకాలు వేస్తున్నప్పటికీ, పట్టణంలో అతిపెద్ద పశువుల సంత ఉండడం వలన గిత్తల వ్యాపారం కోసం తరచుగా బైట కోడెలు పెయ్యలు కోదాడకు వచ్చి వెళ్తుంటాయి.

అందులో తెలిసీ తెలియక వ్యాపారులు లేదా రైతులు వ్యాధి సోకిన వాటిని కొనుగోలు చేసి తేవడం వలన టీకా వేసిన తరువాత పుట్టిన దూడలకు సోకే అవకాశం ఉంది. అందుకే పట్టణంలో ఉన్న 400 తెల్ల జాతి పశువులు ఈ వ్యాధికి గురి కాకుండా మద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమములో పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కంపాటి చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు.