12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

దీపారాధనతో ముగిసిన ఉర్సు ఉత్సవాలు

22-11-2025 09:29 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అర్వపల్లి శివారులోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి. శుక్రవారం సాయంత్రం గంధం ఊరేగింపు జరగగా అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్ డబుల్ పార్టీ వారిచే ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి దర్గాలో దీపారాధన(చిరాగ్) నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా లోపల, బయట భక్తులు వందలాది దీపాలను వెలిగించారు. దీపారాధన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్, స్థానిక ఎస్సై ఈట సైదులు, ముజవార్ సయ్యద్ ఆలీ, అబ్దుల్ హుస్సేన్, అంజద్, కర్కాని రమేష్, మున్నా, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.