15-02-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశంలోని అన్ని నగరాలను ఆర్థికవృద్ధికి చోదక శక్తులుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (యూసీఎఫ్) పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ఈమేరకు న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో జరిగిన కేంద్ర క్యాబినేట్ సమావేశంలో క్యాబినేట్ రూ.లక్ష కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
రాను న్న ఐదేళ్లలో పట్టణ రంగంలో మొత్తం రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే నిధి ప్రధాన ఉద్దేశమని ప్రధాని స్పష్టం చేశా రు. పథకంలో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుంది. అయితే, సదరు ప్రాజెక్టుకు అవసర మైన నిధులలో కనీసం 50 శాతాన్ని మున్సిపల్ బాండ్లు, బ్యాంకు రుణాలు లేదా ప్రభు త్వ -ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ నుండి సమీకరించాల్సి ఉంటుంది.
దీనివల్ల నగరాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకుండా, స్వయం ప్రతిపత్తితో మార్కెట్ శక్తులను వినియోగించుకునే వెసులుబాటు వస్తుంది. 2025 ఆర్థిక సంవ త్సరం నుంచి 2030 -31 వరకు పథకం అమలులో ఉంటుంది. అలాగే స్టార్ట ప్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ‘స్టార్టప్ ఇండి యా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.O’ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడా మెట్రో రైల్ ప్రాజె క్టు విస్తరణకూ క్యాబినేట్ ఆమోదించింది.