2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్-2026 బ్రోచర్, కప్ ఆవిష్కరణ
బోధన్, జూలై 28 (విజయ క్రాంతి): హైదరాబాద్లోని ఈనాడు ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్2026 బ్రోచర్తో పాటు ట్రోఫీ (కప్)ను ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, మార్షల్ ఆరట్స్ ప్రోత్సాహకుడు ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కరాటే మాస్టర్లు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. సుమన్ తల్వార్ మాట్లాడుతూ... రెండో ఏడాదిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ను విజయవంతం చేసేందుకు ప్రతి కరాటే మాస్టర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరాటే ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై మెరుగైన శిక్షణ అందడంతో పాటు కరాటే మాస్టర్లకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన గిన్నిస్ వరల్ రికారడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన కరాటే మాస్టర్ యు. సాయిలుకు డా. సుమన్ తల్వార్ ప్రత్యేక సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫైట్స్ మాస్టర్ రవి మరియు ఒకినావా చీఫ్ కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగు బుక్ ఆఫ్ గిన్నిస్ రికారడ్స్ జ్యూరీ డా. అజయ్ కుమార్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ పి. రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.






