22 July, 2026 | 3:41 AM

ఉద్యోగుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

22-07-2026 12:56 AM

గాంధారి, జూలై 21 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై  తపస్ ఆధ్వర్యంలో ఆగష్టు 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమ పోస్టర్ ను ఉపాధ్యాయుల శిక్షణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో గాంధారి మండల విద్యాశాఖాధికారి శ్రీహరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ తపస్ మండల నాయకులు మాట్లాడుతూ 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించకుండా కాలయాపన చేయడం చాలా దారుణమని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలు పీఆర్సీ, పెండింగ్ డీఏ, సిపిఎస్ రద్దు లపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 1వ తేదీన నిర్వహించే మహాధర్నాలో ఉపాధ్యాయ మిత్రులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముద్దసాని స్వామి, మండల బాధ్యులు కృష్ణ, శ్రీకాంత్, సుజాత, విద్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..