14 July, 2026 | 11:22 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ

02-05-2026 01:42 AM

చిట్యాల, మే 1: చిట్యాల పట్టణంలో మే 5న నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను శుక్రవారం స్థానిక శివాలయంలో సమితి సభ్యులు ఆవిష్కరించారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మే 5న సాయంత్రం 5 గంటలకు గ్రీన్ గ్రో స్కూల్లో సమ్మేళనం నిర్వహించనున్నారు.

దీనికి ముందు మే 2న ఉదయం కనకదుర్గ ఆలయం నుంచి నగర సంకీర్తన, మే 4న ఉదయం భగవద్వజాలు ఎగురవేత, సాయంత్రం దీపారాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే రోజు వ్యవసాయ మార్కెట్ నుంచి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర కూడా నిర్వహించనున్నారు.

ఈ సమ్మేళనం ద్వారా హిందూ ఐక్యతను బలోపేతం చేయడం, సాంప్రదాయ విలువల పరిరక్షణ, యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం ప్రధాన ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.