14 July, 2026 | 11:13 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్

14-07-2026 09:54 AM

వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో సచివాలయం కార్యక్రమానికి వెళ్లకుండా వాంకిడి పోలీసులు సోమవారం రాత్రి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిరే ప్రకాష్ లతోపాటు పలువురు పార్టీ నాయకులు కార్తీక్,తిరుపతి, రాకేష్, తిరుపతిలను ముందస్తు అరెస్ట్ చేసి వాంకిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా సీపీఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ... విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల్లో భాగంగా నిర్వహిస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.