2 May, 2026 | 2:41 AM

వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణం

02-05-2026 01:41 AM

భక్తులతో కిటకిటలాడిన దేవాలయం 

మఠంపల్లి మే 1 : మండలంలోని మట్టపల్లి గ్రామంలో కృష్ణ నది తీరంలో కొలువు దీరిన పంచ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి వారి కళ్యాణోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

దీంతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులతో కిట కిటలాడాయి.అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి తిరు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.స్వామి వారి కళ్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.స్వామి వారి దివ్య మంగళ హారతి భక్తి కార్యక్రమాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పరవశంలో మునిగారు. భక్తుల సౌకర్యార్థం వసతులను దేవ స్థానం అధికారులు, అనువంశిక ధర్మకర్తలు విస్తృత ఏర్పాట్లు చేశారు.

సత్రాల నిర్వాహకులు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమలు నిర్వహించి విశ్రాంతి వసతులు కల్పించారు. భద్రత కోసం పోలీస్ బందోబస్తు కట్టదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు,విజయకుమార్, కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, సర్పంచ్ విజయశాంతి అప్పారావు దేవాలయం సిబ్బంది,అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.