కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ
బోథ్, జూలై 14 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామం లో ఉన్న శబర మాత ఆశ్రమంలో ఈ ఏడాది అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఏర్పాట్ల కోసం భక్తులు రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులను కలుస్తూ నిధులు మంజూరు కోసం అభ్యర్థిస్తున్నారు అందులో భాగంగానే సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల సమందర్ రెడ్డిల ఆధ్వర్యంలో కలిసి సిసి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు దీంతో 7 లక్షల రూపాయల మేర నిదులు మంజూరు కి హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు వారి వెంట ఏజాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రపుల్ చందర్ రెడ్డి, కనుగుట్ట గ్రామస్తులు ఉన్నారు






