14 July, 2026 | 11:08 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

14-07-2026 10:20 AM

ముంబై: భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరగడం వల్ల రూపాయి సహా చాలా ఆసియా దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీని ఫలితంగా, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 48 పైసలు తగ్గి 96.16కు చేరింది. పలు కారణాలతో రూపాయి ఒత్తిడికి గురైందని ఫారెక్స్ వ్యాపారులు(Forex traders) వెల్లడించారు. కొత్తగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగగా, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడంతో అమెరికన్ డాలర్‌కు డిమాండ్ పెరిగింది. అంతర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో రూపాయి 95.95 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత బలహీనపడి 96.16 స్థాయికి చేరింది. తద్వారా రూపాయి మునుపటి ముగింపు స్థాయి నుండి 48 పైసల మేర క్షీణతను నమోదు చేసింది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వల్ల ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గుముఖం పట్టాయి. విదేశీ నిధుల తాజా ఉపసంహరణలు, అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన ధోరణులు కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల BSE సెన్సెక్స్ 552.99 పాయింట్లు తగ్గి 77,063.41కి పడిపోయింది. 50 షేర్ల NSE నిఫ్టీ 160.45 పాయింట్లు తగ్గి 24,050.55కి చేరింది.