14 July, 2026 | 10:00 AM

జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం

14-07-2026 08:51 AM

వైభవంగా గిరి ప్రదక్షిణ.. ఆరుద్రోత్సవంలో ప్రత్యేక పూజలు

అలంపూర్: శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తి పారవశ్యం నెలకొంది. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారికి ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ బీరం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని, ఆలయంలో నిత్య, విశేష పూజలు కొనసాగుతున్నాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి దీప్తి తెలిపారు