7 July, 2026 | 1:42 AM

సర్కార్ ‘బడి’ లోనే!

07-07-2026 12:47 AM

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడిలోనే ఉపాధ్యాయుల పిల్లలు

తాము చేర్పిస్తూ ఇతరులకు ప్రోత్సాహం

టీచర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న స్థానికులు

జుక్కల్, జూలై 6 (విజయక్రాంతి): ప్రస్తుత రోజుల్లో సామాన్యులు సైతం తమ పిల్లలను ప్రైవేటు స్కూల్  వైపు మొగ్గు చూపిస్తూ నూతన పోకడలకు ఆకర్షితులై ప్రవేట్ స్కూల్లలో తమ పిల్లలను చేర్పిస్తున్న తరుణంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడుల్లో చేర్పించవద్దని నిర్ణయించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

అయితే దీనికి తగ్గట్టుగానే కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి పాఠశాలలో కట్టాలి తాండ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బి. ప్రియాంక తన కూతురు కనిష్కను ఎల్కేజీలో చేర్పించారు. అదేవిధంగా మహ్మదాబాద్ తాండలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి తన కూతురు భవిష్యను ఒకటవ తరగతిలో చేర్పించినట్లు ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూలు ఏదైనా విద్యార్థులను చదువు చెప్పే విధానాన్ని బట్టి విద్యార్థులు మంచి చదువులు చదువుకోగలరని తాము భావించి అదే ఉద్దేశంతో తమ స్కూల్లోనే తమ కళ్ళ ముందు ఉంటారని పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం జరిగిందన్నారు. ఏదైనా మంచి పని ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని మాటను నిజం చేయడానికి తాము కూడా అక్కడక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తున్నారని తెలుసుకొని తాము జుక్కల్ మండలంలో మొదటిసారిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించామని అన్నారు.

తమకు చూసి తోటి ఉపాధ్యాయులు కానీ ఇతర ఉద్యోగస్తులు గాని ప్రభుత్వ బడుల్లోనే తమ పిల్లలకు కనీసం పదవ తరగతి వరకు అయినా చదివిస్తే త్వరగా విభేదాలు కుల మతాలు తెలియకుండా సామాజికంగా అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉపాధ్యాయుల నిర్ణయాన్ని జుక్కల్ మండల ప్రజలు స్వాగతిస్తున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం కృష్ణాజి వాడి గ్రామంలో కానిస్టేబుల్ రవి తన కుమారుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు మోగ్గు చూపుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పలువురు కోరుతున్నారు.