7 July, 2026 | 1:17 AM

చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ నాయుడు

07-07-2026 12:50 AM
  1. ఎంపీ బలరాం నాయక్ భేటీ 
  2. పార్టీ బలోపేతం, అభివృద్ధిపై చర్చ

చర్ల, జూలై 6: (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. 

గ్రామస్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతాలను బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ సూచించారు. చర్ల మండల అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎం  పి హామీ ఇచ్చారు.