calender_icon.png 23 February, 2026 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

23-02-2026 12:39:55 AM

అలంపూర్, ఫిబ్రవరి 22: అష్టాదశ శక్తిపీఠాలలోని ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన ఆలయాలను కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా మంత్రి కుమారస్వామి దంపతులకు అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం జోగులాంబ దేవి ఆలయానికి చేరుకొని అమ్మవారికి కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు శేషవస్త్రం,తీర్థ ప్రసాదాలను మంత్రి  దంపతులకు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.అనంతరం మంత్రి మీడియా సమావేశంలో తనదైన కన్నడ శైలిలో మాట్లాడుతూ... ఈ అద్భుతమైన శక్తిపీఠాన్ని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం.అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై,ముఖ్యంగా రైతు సోదరులపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.కర్ణాటకకు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో కన్నడ భక్తులను తరలివస్తుంటారని తెలుగు, కన్నడ రాష్ట్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధం విడదీయలేనిదని కొనియాడారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు కలెక్టర్ బీఎం సంతోష్ ,ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.