23-02-2026 12:39:24 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరోసా
మునుగోడు, ఫిబ్రవరి 22 : ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని రండి& మీ రెండు కళ్లూ పూర్తిగా బాగయ్యేంతవరకు నేను మీతోనే ఉంటూ ప్రతి నెల ఉచిత కంటి శిబిరం కొనసాగిస్తాం అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన కంటి చూపు కల్పించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది.
12వ విడతగా మునుగోడులోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన శిబిరానికి చండూరు మున్సిపాలిటీ 10 వార్డులు, మండలంలోని 19 గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు,
వైస్ చైర్మన్ భూతరాజు దశరథులతో కలిసి ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న రోగులతో మాట్లాడి వారి కంటి సమస్యలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.శిబిరంలో మొత్తం 610 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 250 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. అందులో 155 మందిని వెంటనే హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రి కు తరలించగా, మిగిలిన వారిని మంగళవారం తరలించి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూర్ మున్సిపాలిటీ ,మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మునుగోడులో నారబోయిన కనకయ్యకు నివాళి
మునుగోడు, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజు తండ్రి, రిటైర్డ్ ఉద్యోగి నారబోయిన కనకయ్య (82) ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కన్నుమూశారు. వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పట్టణం లోని వారి నివాసానికి చేరుకుని కనకయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనకయ్య నిష్కళంకంగా సేవలందించిన విధానం ఆదర్శనీయమని కొనియాడారు. వారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.కనకయ్య మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.