07-02-2026 12:29:47 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 6: పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా,దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న కోరారు.మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించి పరిసరాల,వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పలు ఇళ్లను,వీధులను సందర్శించి ఇంటి పరిసరాలు,వీధుల్లోని నీటి గుంటలో ఆయిల్ బాల్స్,బ్లీచింగ్ పౌడర్ వేశారు.డ్రైనేజీని శుభ్రం చేయించారు.అనంతరం దోమలు వృద్ధి చెందకుండా నివారణ మందును స్ప్రే చేయించి,దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ బిచ్చునాయక్,ఉపసర్పంచ్ రవీందర్,పంచాయతీ కార్యదర్శి సుధాకర్,ఏఎన్‌ఎం గిరిజ,వార్డు సభ్యులు తవిటి సైదులు, మాగి మీనాక్షి, లతీఫ్, రవి, సరితరామకృష్ణ, శారదనాగరాజు, తనేష్, స్రవంతి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.