ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే
సిలిండర్ బుకింగ్ కు నగరాల్లో 25, గ్రామాల్లో 45 రోజులు
న్యూఢిల్లీ: దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సమార్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) తెలిపారు. చమురు శుద్ధి కర్మాగారాలు వంద శాతానికి మించి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్, ఇంధన చమురు కొరత లేదన్నారు. హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. హర్మూజ్ యేతర ముడి చమురు సరఫరా 70 శాతానికి పెరిగిందన్నారు. బారత దిగుమతుల వనరులు 27 దేశాల నుంచి 40 దేశాలకు పెరిగాయని వెల్లడించారు. 60 శాతం ఎల్పీజీని మనం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.
దేశంలో గృహవినియోగ సిలిండర్ల(Domestic use cylinders) సరఫరాకు ఇబ్బందులు లేవని హర్దీప్ సింగ్ పూరీ లోక్ సభలో వెల్లడించారు. సిలిండర్ల సరఫరాలో ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సిలిండర్ బుకింగ్(Cylinder Booking)కు నగరాల్లో 25, గ్రామాల్లో 45 రోజులు గడువు విధించామని పేర్కొన్నారు. వాణిజ్య సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హర్దీప్ సింగ్ హెచ్చరించారు. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేదని సూచించారు. ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు ఆగిపోవడం ఇదే తొలిసారి అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు..




