12 March, 2026 | 9:45 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఇది ఆరంభం మాత్రమే.. గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుంది

12-03-2026 05:37 PM

లోక్ సభలో ఎప్ స్టీన్.. ఎప్ స్టీన్

న్యూఢిల్లీ: లోక్ సభలో ఎల్పీజీ(LPG Issue) అంశంపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ లో ఎల్ పీజీ అంశంపై మాట్లాడారు. ఇది ఆరంభం మాత్రమే అన్న రాహుల్ గాంధీ గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోందని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) నుంచి పెద్దఎత్తున దిగుమతులు జరగాల్సి ఉందని తెలిపారు. యుద్ధ సమయంలో హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని చెప్పారు. తన ప్రసంగంలో ఎప్ స్టీన్ ఫైల్స్ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎప్ స్టీన్ ఫైల్స్(Epstein files) ప్రభావం ఎల్ పీజీ దిగుమతులపై పడినట్లు ఉందని తెలిపారు.

ఎప్ స్టీన్ తో సంబంధాలను పెట్రోలియం మంత్రి(Petroleum Minister) అంగీకరించారని రాహుల్ సభలో అన్నారు. మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. రష్యా నుంచి చమురు కొనాలో? వద్దో? మనకు మనం నిర్ణయించుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకు? అని కేంద్రాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత్ వంటి పెద్ద దేశానికి మరో దేశం అనుమతి అవసరమా? అన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందా అని ఆలోచించానని, తన ప్రశ్నకు సమాధానం ఎప్ స్టీన్ ఫైల్స్ రూపంలో దొరికిందన్నారు.

పరిస్థితులను చక్కదిద్దుతున్నామని పెట్రోలియం మంత్రి వెల్లడించారు. లోక్ సభలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ(Union Minister Hardeep Singh Puri) ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఎప్ స్టీన్.. ఎప్ స్టీన్ అంటూ లోక్ సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.  ప్రధాని నరేంద్రమోదీ చర్చల వల్ల పరిస్థితులు సర్దుకుంటున్నాయని కేంద్రమంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.