17 August, 2026 | 3:28 AM

ఇంజాపూర్ బోనాలకు కేంద్రమంత్రి బండి సంజయ్

17-08-2026 12:58 AM

ఆదిభట్ల, ఆగస్టు 16 (విజయ క్రాంతి): బీజేపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు నోముల దయానంద గౌడ్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్ డివిజన్ ఇంజాపూర్ గ్రామానికి చేరుకుని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేశానికి వాజ్పేయీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.బోనాల సందర్భంగా ఇంజాపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నోముల దయానంద గౌడ్, బోసుపల్లి ప్రతాప్, నోముల కార్తీక్ గౌడ్, ఎలిమినేటి నరసింహారెడ్డి, నరసింహ గౌడ్, బచ్చిగల రమేష్, కొండ్రు పురుషోత్తం, మల్లెల ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.