17 August, 2026 | 2:14 AM

కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు

17-08-2026 12:59 AM

ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్‌పల్లి, ఆగస్టు 16 ( విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ప్రజలు కాలను సహకారం చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నాడు మండలం టంగుటూరు గ్రామంలో ఆదివారం గడ్డం అరుణ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

ఇండ్లు లేని పేదవారికి స్థలం ఉంటే రూ. ఐదు లక్షలు ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. లబ్ధిదారులకి స్థలం లేకుండా ప్రభుత్వం స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ బద్దం హరిత కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, శంకర్ పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపతి చంద్రమౌళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చేకూర్త గోపాల్ రెడ్డి, మోకిలా సర్పంచ్ చితంపల్లి శేఖర్, మోకిలా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌండ్ర సత్యం, నాయకులు నరేందర్ రెడ్డి, కాంత్ రెడ్డి, పోలీస్ రామ్ రెడ్డి, టంగుటూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.