నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలి: సిఐటియు డిమాండ్
దమ్మపేట,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సి ఐ టి యు మండల కన్వీనర్ మురహరి రఘు డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్స్ తో కూడిన ప్లేకార్డ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ దేశంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు భవిష్యత్తు కోసం నీట్ పరీక్ష రాస్తే మోడీ ప్రభుత్వం చేతకానితనం వల్ల పేపర్ లీకేజీ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, గత కొన్ని సంవత్సరాలుగా అనేక పరీక్షలు లీకేజీల వల్ల విద్యాశాఖ భ్రష్టు పట్టిందని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లీకేజీకి కారణమైన అధికారులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాను అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కవులూరి రామకృష్ణ, సతీష్, శ్రీను, యుగంధర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.






