జాతీయ సెమినార్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం
13-07-2026 12:00 AM
పాలమూరు విశ్వవిద్యాలయం జూలై 12: పియూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీలలో కన్హ శాంతి వనంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక రెండు రోజుల ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్‘ జాతీయ సెమినార్కు అతిథులుగా విచ్చేయాలని కోరుతూ పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఆదివారం హైదరాబాద్లో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిన, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు లను మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, ఉపకులపతి ప్రత్యేక విధుల అధికారి డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.






