13 July, 2026 | 1:04 AM

జిల్లాలో 42 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి

13-07-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భైంసా,జూలై 13 ( విజయ క్రాంతి): జిల్లాలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుం దని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.  ఆ దివారం భైంసా పట్టణంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భా గంగా ఇప్పటికే ప్రతి ఓటరుకు ఎస్‌ఐఆర్ ఫారములు అందివ్వడం జరిగిందని అన్నా రు.

ఎస్‌ఐఆర్ ఫారముల ప్రక్రియ స్వీకరణ కూడా కొనసాగుతుందని వివరించారు. తిరి గి తీసుకున్న ఫారముల డిజిటలైజేషన్ ప్రక్రి య నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 42 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా పరిధి కిందికి వచ్చే 23 మండలాల్లో 7 లక్షల 55 వేల ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లు వివ రించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ప ట్టణ ప్రాంతాలలో ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉందని, బైంసా పట్టణానికి సంబంధించి నిన్నటి సాయంత్రం వరకు 20 శాతం ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు.

పట్టణ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, బిఎల్‌ఓ, బిఎల్‌ఓ సూపర్వైజర్ల ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో భాగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై సమగ్రంగా అవగాహన కల్పించారు. పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, వారి సందేహాలు నివృత్తి చేశారు. ప్రతి బిఎల్‌ఓ తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సహకారం అందించాలని తెలిపారు.ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహసిల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్‌ఓ సూపర్వైజర్లు, బిఎల్‌ఓ లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.