గుండ్లపల్లి మేజర్ కాలవలో కంప చెట్లు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు
చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు చేరేదెలా...?
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి మేజర్ కాలువలో(Major Canal) మఠంపల్లికి చెందిన కొంతమంది కూలీలు ఉపాధి హామీ పనులతో వారం రోజులుగా కాలువకు ఇరుపక్కల ఉన్న చెట్లు కొట్టి కాలువ లోపల మట్టి తీయడం జరిగింది. దాని ప్రక్కన ఉన్న కౌలు రైతు కాలువ గట్టుమీదనున్న చెట్లు మొత్తం జెసిబితో తొలగించి కాలువలోకి నెట్టి వేయడం జరిగింది. ఆ రైతు అలా చేయడం వల్ల ఉపాధి కూలీలు నష్టపోవడమే కాకుండా ఆయకట్టు చివర వరకు నీళ్లు అందాలనే సంకల్పంతో ఉపాధి హామీ పనులు వేగవంతంగా జరుగుతుండగా క్రింది పొలాల వారికి నీళ్లు పోవడానికి కూడా దారి లేకుండా చేయడం ఏంటని ఆ కౌలు రైతు వెంటనే కాలువలో వేసిన కంప చెట్లను తీసివేసి ఉపాధి హామీ కూలీలకు,ఆయకట్టు రైతులకు నీళ్ళు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.






