18 May, 2026 | 4:13 PM

ప్రధాని వ్యాఖ్యల వెనుక పరమార్థం వేరు

18-05-2026 02:52 PM

నిర్మల్ మే 18 (విజయక్రాంతి): దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం వెండి కొనుగోలు చేయవద్దని ప్రధాని మాట వెనుక పరమార్థం వేరుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ అన్నారు. దేశంలో ప్రజలు వెండి బంగారాన్ని స్థిరాస్తిగా భావిస్తారని అటువంటి స్థిరాస్తిని కొనుగోలు చేయవద్దని పడటం వెనుక సంపన్నులకు కొమ్ముకాసే విధంగా ప్రభుత్వం వివరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వెండి బంగారం ధరలను తగ్గించి సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ వినోద్ కుమార్ అబ్దుల్ సాదిక్ వసంతరావు మెరుగు రాజన్న తదితరులు ఉన్నారు