ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా చిరువ్యాపారులకు గొడుగుల పంపిణీ
మెదక్, జులై 24 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కేటీఆర్ పేరుపై ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పట్టణంలో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్త్మ్రల్‘ సేవా కార్యక్రమంలో భాగంగా చిరువ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఐటీ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. కేటీఆర్ ఆశయాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజాసేవను మరింత విస్తృతం చేయాలని సూచించారు. మండుటెండలు, వర్షాకాలంలో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు ఈ గొడుగులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ లు, ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఏం లావణ్య రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి. ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, నాయకులు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగారెడ్డి, ప్రభు రెడ్డి, సురేందర్ గౌడ్, మాయ మల్లేశం, ఆర్ కె శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, సోములు, జగన్, కిష్టయ్య, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్,సాయి, సాప. సాయిలు, రామచంద్ర రెడ్డి,సాయ గౌడ్, యామి రెడ్డి,రమేష్,మార్గం. ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, మోహన్ నాయక్, నరేందర్ రెడ్డి, ప్రభాకర్,మధు, వేణు,శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్, ఎంబిపూర్ మహేష్,రవి, చాంద్ పాషా, అమీర్ తదితరులు పాల్గొన్నారు.






