25 May, 2026 | 3:43 PM

రెండు ద్విచక్ర వాహనాల ఢీ

25-05-2026 02:32 PM

ఇద్దరూ మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

కోదాడ,(మునగాల): రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరూ మృతి చెందగా మరొక ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని సర్వీస్ రోడ్డు నందు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్నటువంటి బరాకత్ గూడెం గ్రామానికి చెందిన నారగాని వెంకట్ కుమార్ (16) అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా. కోదాడకు చెందిన బత్తిని మణికంఠ(17) అనే వ్యక్తి మరణించాడు. ఈ సంఘటనలో గాయాల పాలైన నిఖిల్, నందు అనే ఇద్దరు యువకులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని. మరొకరు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రత్నం తెలిపారు.