25 May, 2026 | 4:43 PM

ఉద్యమకారులను గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం

25-05-2026 03:33 PM

ఈనెల 29న మోత్కూరులో శంకరమ్మ స్వాతిల సన్మాన కార్యక్రమం

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాసోజు శంకరమ్మ, చిట్యాల స్వాతిలకు మహిళా కమిషన్ పదవులను ఇచ్చి, నిండుగా గౌరవించిందని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆయన మాట్లాడుతూ ఈనెల 29న మోత్కూరులో ఉద్యమకారులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల స్వాతిలను జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం పని చేసిన ప్రతి నాయకున్ని ముఖ్యమంత్రి గుర్తించుకొని, అవకాశం వచ్చిన ఇప్పుడు సముచిత పదవులు వస్తాయని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలుపు కోసం ప్రతి కార్యకర్త ,నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రేగటి రవి సర్పంచుల సంఘం అధ్యక్షుడు బికోజి, మాచర్ల అనిల్, గంగరాజు, కృష్ణ, దాసరి శ్రీను, ఝాన్సీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.