25 May, 2026 | 3:55 PM

ఇంటర్ తరగతులు వెంటనే ప్రారంభించాలి

25-05-2026 02:52 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూరు, నెన్నల, వేమనపల్లి మండలాల్లో జూనియర్ కళాశాల తరగతులు వెంటనే ప్రారంభించాలనీ టీ ఆర్ ఎస్ వీ జిలా అధ్యక్షుడు బడికల  శ్రావణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఏవో హన్మంతరావుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు, నెన్నల, వేమనపల్లి మండలాలకు మంజూరు అయిన జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించాలన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జూనియర్ కళాశాలలు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.  గత సంవత్సరం హంగు ఆర్భాటాలతో 3 మండలాలకు జూనియర్ కలశాలలు మంజూరు చేసిన కూడా నేటి వరకు తరగతులు ప్రారంభం చేయలేదని దుయ్యబట్టారు. కళాశాల లమంజూరు కేవలం పేపర్లకు పరిమితం అయ్యాయని విమర్శించారు.  స్థానిక MLA గడ్డం వినోద్ నిర్లక్ష్యంతో తరగతులు ఇంకా ప్రారంభం కాలేదనన్నారు.

3 మండలాల్లో పదవ తరగతి చదనుకొనే విద్యార్థులు సుమారుగా 1500 మంది ఇంటర్ విద్య అందక నష్టపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక MLA గడ్డం వినోద్ విద్యార్థుల భవిష్యత్ పై దృష్టి పెట్టి జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభం అయ్యేలా చొరవ తీసుకోవాలి కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే  BRSV అద్వ్యర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.