మండల టాపర్ భోగ విజయ్ కుమార్‌కు ఘన సన్మానం
25-05-2026 02:39 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి భోగ విజయ్ కుమార్ పదవ తరగతి పరీక్షల్లో 573 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థి విజయ్ కుమార్‌ను బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కష్టపడి చదివి మండలానికి, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన విజయ్ కుమార్‌ను అభినందించారు. ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






