25 May, 2026 | 3:44 PM

భక్తిశ్రద్ధలతో శబరిమాత ఆలయం మూడవ వార్షికోత్సవం

25-05-2026 02:35 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమ మూడవ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. వివిధ మండలాల నుండి వచ్చిన శబరిమత భక్తులు శబరిమాత పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆర్కెస్ట్రా బృందం వారు ఆలపించిన భక్తి గీతాలు భక్తుల నాకట్టుకున్నాయి. పాద పూజ కార్యక్రమాన్ని శబరిమాత శిష్యుడు ఎడమల ధర్మారెడ్డి చేతులమీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంట తో పాటు మరో జంట పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కౌట(బి )గ్రామానికి చెందిన బద్ధం ప్రభాకర్ రెడ్డి తో పాటు గాయకుడు రమేష్ లు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు